YouTube గురించి
ప్రతిఒక్కరూ తమ మనస్సులోని భావాలను వ్యక్తపర్చగల మరియు తమ విశేష నైపుణ్యాలను ప్రపంచానికి చూపగల సదావకాశాన్ని కల్పించడమే మా లక్ష్యం.
ప్రతి ఒక్కరికి తమ గొంతు విప్పి మాట్లాడే అర్హత ఉంటుందని మేము భావిస్తాము, ఇతరుల అనుభవాలను మనం వింటూ, మన కథలను ఇతరులతో పంచుకుంటూ ఆ పునాదులపై సమాజాన్ని నిర్మించుకుంటే అదే మరింత మెరుగైన ప్రపంచం అవుతుందని మా నమ్మకం.
మనం ఎవరిమి అనే విషయాన్ని నిర్వచించే ముఖ్యమైన నాలుగు రకాల స్వేచ్ఛలపై మా విలువలు ఆధారపడి ఉంటాయి.
భావప్రకటన స్వేచ్ఛ
ప్రజలందరూ భావప్రకటన స్వేచ్ఛతో తమ అభిప్రాయాలను పంచుకోవాలని, స్వేచ్ఛగా చర్చించాలని మరియు ఈ సృజనాత్మక స్వేచ్ఛతో అనేక మంది ఔత్సాహిక ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని మా ఆకాంక్ష.
సమాచార స్వేచ్ఛ
ప్రతిఒక్కరూ సమాచారాన్ని చాలా సరళంగా మరియు సునాయాసంగా పొందగలగాలని మా ఆకాంక్ష, ఈ లక్ష్యసాధనలో విద్య, నిర్మాణ అవగాహన మరియు ప్రపంచవ్యాప్త ఈవెంట్‌ల సాధక రూపకానికి, పెద్దవాటికి మరియు చిన్నవాటికి వీడియో అనేది అత్యంత శక్తివంతమైన వనరు.
అవకాశం పొందే స్వేచ్ఛ
ప్రతిఒక్కరూ తమ ప్రతిభను నిరూపించుకోగల మరియు వ్యాపార సంస్థను నెలకొల్పి, వారికంటూ స్వంత నిబంధనలతో విజయవంతంగా రాణించగల అవకాశం కల్పించాలని మరియు ఎలాంటివి జనాదారణ పొందగలవో నిర్ణయించగల అధికారాన్ని గేటు బయట ఉండే కావలి వ్యక్తులకు కాకుండా ప్రతిభావంతులైన వ్యక్తుల చేతుల్లో ఉంచాలని మా ఆకాంక్ష.
స్వంత భావన స్వేచ్ఛ
ప్రతిఒక్కరూ సహాయకరంగా ఉండే సంఘాలను కనుగొనాలని, అవరోధాలను అధిగమించాలని మరియు ఎలాంటి హద్దులు లేకుండా అందరూ కలిసిమెలిసి పరస్పర సారూప్య భావాలతో స్ఫూర్తిదాయకంగా నడుచుకోవాలని మా ఆకాంక్ష.